Ap News: రేపే మద్యం దుకాణాలకు డ్రా.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..!

ఏపీలో కొత్త మద్యం పాలసీ ఈ నెల 16 నుంచి అమల్లోకి రానుంది...

Update: 2024-10-13 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో కొత్త మద్యం పాలసీ(New Liquor Policy) ఈ నెల 16 నుంచి అమల్లోకి రానుంది. గత ఐదేళ్లలో మద్యంపై ప్రభుత్వమే అమ్మకాలు జరిపింది. దీంతో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కొత్త పాలసీని తీసుకురావాలని, తక్కువ ధర(Low Price)కే మద్యం అమ్మకాలు జరగాలని నిర్ణయించింది. ప్రైవేటు విధానా(Private Policy)న్నే అమలు చేసేందుకు కసరత్తులు పూర్తి చేసింది. ఈ మేరకు మద్యం దుకాణాల(Liquor Stores)కు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 3396 దుకాణాలకు గాను 89, 882 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు దరఖాస్తుల ఫైనల్ డేటాను సిద్ధం చేశారు. సోమవారమే మద్యం దుకాణాలను డ్రా తీయనున్నారు.

ఇక దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల ఆదాయం లభించింది. దరఖాస్తుల ద్వారా రూ. 1500 నుంచి రూ. 1600 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అంచనాలను మించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సరాసరి 50 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దుకాణానికి సరాసరి 25 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. ఇక మాన్యువల్ పద్ధతి ద్వారా అధికారులు డ్రా తీస్తారు. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. ఈ నెల 16 నుంచి ఏపీలోని అన్ని వైన్ షాపుల్లోఅన్ని బ్రాండ్ల బ్రాండెడ్‌ను అమ్మకాలు జరపనున్నారు. 


Similar News