సత్యసాయి జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనలో పురోగతి

సత్యసాయి జిల్లా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి...

Update: 2024-10-13 13:23 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District)లో జరిగిన గ్యాంగ్ రేప్(Gang Rape) ఘటన సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. నల్లబొమ్మనపల్లి(Nallabommanapalli)లో తండ్రీకొడుకును కొట్టి అత్తాకోడళ్లపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక సీసీ ఫుటేజ్‌ ద్వారా ఆధారాలు సేకరించారు. మొత్తం ఆరుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరగా కేసును ఛేదిస్తామని చెప్పారు.

మరోవైపు బాధితురాలిద్దరికీ హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి(Hindupuram Government Hospital)లో చికిత్స పొందుతున్నారు. దీంతో మంత్రి సవిత(Minister Savita) హిందూపురం ఆస్పత్రికి వెళ్లారు. అత్యాచారానికి గురైన అత్తాకోడళ్లను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు. 

For more Details : కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్


Similar News