జేసీ 15 శాతం కమీషన్ వ్యాఖ్యలు.. ఎస్ఎమ్‌లో ఏకిపారేస్తున్న నెటిజన్స్
జేసీ ప్రభాకర్ రెడ్డి 15 శాతం కమీషన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు..
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మద్యం అమ్మకాల విషయంలో ప్రైవేటు విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. సోమవారం మద్యం దరఖాస్తులను డ్రా తీయనుంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలు చేయాలంటే 15 శాతం డబ్బులు ఇవ్వాల్సిందేనన్నారు. అలా వచ్చిన డబ్బులను తాడిపత్రి అభివృద్ధికి వినియోగిస్తానని చెప్పారు. వ్యాపారుల నుంచి వచ్చిన 15 శాతం డబ్బులతో పాటు తాను కూడా మరో 15 శాతం ఇస్తానని తెలిపారు. తాడిపత్రిలో ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకోవచ్చని సూచించారు. కానీ 15 శాతం డబ్బులు మాత్రం కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. తనకు ఒక్క రూపాయి వద్దని, తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి కోసం 2025 డిసెంబర్ నాటిని తన సొంత డబ్బులు రూ. 10 కోట్ల ఖర్చు పెడతానని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ ప్రకటనపై భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యతిరేకులు మాత్రం విమర్శలు చేస్తున్నారు. నియోజవకర్గం అభివృద్ధి పేరు చెప్పి డబ్బులు కొట్టివేయడానికేనని సెటైర్లు వేస్తున్నారు. బహిరంగంగా కమీషన్‌పై వ్యాఖ్యలు చేయడంతో కామన్ ప్రజల్లో మిశ్రమమైన స్పందన కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఎక్కువ శాతం విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, నాయకుల వాటాలు ఇలా ఉంటాయా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 2014లోనూ కమీషన్లు దండుకున్నారంటూ మండిపడుతున్నారు.
JC ఇంత మాట్లాడుతున్నా
— Sridhar Reddy Avuthu (@SridharAvuthu) October 13, 2024
మౌనం గా ఉన్నారు అంటే EVM CM & EVM DCM కి వాటాలు వెళుతున్నాయి అనేగా అర్ధం !!
దరిద్రాన్ని EVM ద్వారా నెత్తిన పెట్టారు.
ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాదు ఇది.
MLA Tax 15 %
నియోజకవర్గం Tax 20 %
2014 లో కూడా చాల చోట్ల MLA లు ఇలాగే Tax లు వసూలు చేశారు.… pic.twitter.com/ve32AwYtyM