YCP ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ షాక్
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని హైకోర్టు సస్పెండ్ చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ తగిలింంది. జీవో నెంబర్ 1నుపై హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈనెల 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఈనెల 20 వరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇకపోతే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్-1ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ హైకోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని ఏజీ శ్రీరాం హైకోర్టులో వాదించారు. ప్రస్తుతం ఉన్న బెంచ్‌కు పిల్‌ను విచారించే అధికారం లేదని ఏజీ శ్రీరాం స్పష్టం చేశారు.
దీంతో పిల్‌ను తామే అత్యవసరంగా విచారిస్తామని వెకేషన్ కోర్టు వెల్లడించింది. అనంతరం విచారణ చేపట్టింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం ఈనెల 23 వరకు జీవో నెంబర్ 1పై సస్పెండ్ విధించింది. ఇకపోతే రోడ్లపై ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌షోలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇటీవలే జీవో నెంబర్1 విడుదల చేసింది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో చేపట్టిన రోడ్‌షోకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
Also Read....