వాలంటీర్లు పౌరసేవకే పరిమితం కావాలి : Chandrababu Naidu
వాలంటీర్ల వ్యవస్థ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కావాలని సూచించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వాలంటీర్ల వ్యవస్థ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కావాలని సూచించారు. అంతేగానీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కుదరదు అని అన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు సేకరించడం ద్రోహం అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత డేటా సేకరించడం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల సేవలను ప్రజాసేవ వరకే సేవలు పరిశీలిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తుంటుందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల పై చంద్రబాబు సమాధానం దాటవేశారు. ఎవరెవరో మాట్లాడిన వాటి పై స్పందించి చులకన కాదల్చుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు నాకు ముఖ్యం. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే నా లక్ష్యం. పెద్ద బాధ్యత నాపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరం. పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ. ఓట్ల అవకతవకలపై ఢిల్లీ వరకు వెళ్లి పోరాడతాం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
Read more : Posani Krishna Murali on Pawan Kalyan : పోసాని సంచలన వ్యాఖ్యలు