TDP: ఇందులో కుట్ర కోణం లేదంటావా జగన్?.. టీడీపీ సంచలన ట్వీట్
సామర్థ్యం లేనప్పుడు ఏఆర్ డెయిరీకి కాంట్రాక్టు ఎందుకిచ్చారని, ఇందులో కుట్ర కోణం లేదంటారా అని తెలుగు దేశం పార్టీ ఆరోపించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: సామర్థ్యం లేనప్పుడు ఏఆర్ డెయిరీకి కాంట్రాక్టు ఎందుకిచ్చారని, ఇందులో కుట్ర కోణం లేదంటారా అని తెలుగు దేశం పార్టీ ఆరోపించింది. లడ్డూ కల్తీ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కిలోకు రూ.35 నష్టం అని సంచలన పోస్టు పెట్టారు. ఇందులో కిలో నెయ్యి రూ.355 కొని, టీటీడీకి రూ.320 రూపాయలకు ఎందుకు ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. 3,300 కిలో మీటర్ల ప్రయాణ ఖర్చులు అదనంగా పెట్టుకొని, 10 లక్షల కిలోలు సరఫరా చేశారని, ఏ కంపెనీ అయినా ఇంత నష్టానికి ఎందుకు వ్యాపారం చేస్తుందని అడిగారు. అలాగే టెండర్ దక్కించుకున్నది ఏఆర్ డెయిరీ అయితే నెయ్యి తయారీ మాత్రం ఉత్తరాఖండ్ మధ్యవర్తి వైష్ణవి డెయిరీ నుంచి వస్తుందని చెబుతూ.. ఇందులో కుట్ర కోణం లేదంటావా జగన్ అని ప్రశ్నించారు. దీనిపై నిబంధనలు మార్చి మరీ టెండర్ కట్టబెట్టినా.. ఆ కంపెనీ నష్టానికే నెయ్యిని పంపిందని తెలిపారు. ఇందులో కుట్ర కోణం ఉందన్న అనుమానం ఇక్కడే వస్తోందని, ఎక్కడి ఉత్తరాఖండ్ నెయ్యి.. ఎక్కడ టీటీడీ.. మధ్యలో వైష్ణవి డెయిరీ పాత్ర ఏంటని పలు ప్రశ్నలు సంధిస్తూ.. సామర్థ్యం లేనప్పుడు ఏఆర్ డెయిరీకి కాంట్రాక్టు ఎందుకిచ్చారని, ఏమిటీ కుట్ర అని టీడీపీ రాసుకొచ్చింది.