AP Home Minister:హోంమంత్రి అనితతో ఏపీ టిడ్కో చైర్మన్ భేటీ

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సునీల్ కుమార్ మంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు

Update: 2024-11-27 14:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సునీల్ కుమార్ మంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. 40 వేలకు మించి నివాసముండే టిడ్కో గృహల సమీపంలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. 10వేల మంది నివసించే టిడ్కో గృహాల పరిధిలో పోలీస్ అవుట్ పోస్టులు పెట్టాలని కోరారు. అసాంఘీక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా అన్ని ఎన్టీఆర్ కాలనీలలో సీసీటీవీలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అనిత అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి సత్వరమే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Similar News