AP News:రోగాల అంచున బతుకులు.. రోడ్డుపై కుంటను తలపిస్తున్న మురుగు నీరు

శుభ్రత, పరిశుభ్రత.. చేతులు కాళ్ళు కడుక్కోవాలి. వేడి నీరు తాగాలి, మా ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ చేరే వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలి.

Update: 2024-11-27 14:20 GMT

దిశ,మంత్రాలయం రూరల్/కోసిగి: శుభ్రత, పరిశుభ్రత.. చేతులు కాళ్ళు కడుక్కోవాలి. వేడి నీరు తాగాలి, మా ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ చేరే వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలి. ఇలా వైద్యులు, అధికారులు సమావేశాల్లో ప్రజలకు వివరిస్తారు. జాగ్రత్తలు సూచిస్తారు.. కానీ అనారోగ్య మూలాలు కళ్లెదుటే కనబడుతున్న పట్టించుకోరు. చివరికి చాలా మంది వీధుల్లో రోగాల అంచున బతుకులు సాగదీస్తూ అనారోగ్యంపై నడక కొనసాగిస్తున్నారు. కోసిగి మండల పరిధిలోని దుద్ధి గ్రామంలోని ప్రధాన రోడ్డుపై ఉన్న సచివాలయం, హెల్త్ క్లినిక్ నీళ్ల ట్యాంక్ దగ్గర పరిసర ప్రాంతాల్లో పాటు వీధిలో మురుగు నీరు నిల్వ చేరి అనారోగ్యాన్ని ఆహ్వానిస్తుంది. కనీసం ఆ రహదారిపై పాదచారులు నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి.

ముఖ్యంగా తాగు నీళ్ల ట్యాంక్ వద్ద నిల్వ నీరు పోయే అవకాశం లేకపోవడంతో రహదారిపై మురుగు నీరు నిల్వ చేరి దోమలకు నిలయంగా మారింది. ఈ మురుగునీరు పేరుకుపోవడంతో టైఫాయిడ్, మలేరియా,డెంగ్యూ, వ్యాధుల బారిన పడి ప్రాణపాయ స్థితికి చేరుకుంటామేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్య పరిష్కరించాలని గ్రామ పరిధిలోని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారేగాని, అది ఆచరణలో అమలు కావడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా ఎంపీడీవో వెంకటేశ్వర్లు స్పందించి సమస్య పరిష్కారానికై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News