పొలంలోకి దిగిన కాసేపటికే 8 మంది రైతులకు అస్వస్థత.. అసలేం జరిగిందంటే?

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోరు మండలం పందలపాకలో ఎనిమిది మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. వీరంతా ఆదివారం గ్రామంలో కూలి పనికి వెళ్లారు.

Update: 2024-08-18 12:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోరు మండలం పందలపాకలో ఎనిమిది మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. వీరంతా ఆదివారం గ్రామంలో కూలి పనికి వెళ్లారు. ఈ క్రమంలో 15 ఎకరాల పంట పొలాల్లో మందు చల్లేందుకు పొలాల్లోకి దిగారు. అయితే మందు చల్లిన తరువాత దాహం వేస్తే మజ్జిగ తాగి మళ్లీ పనిలోకి వెళ్లారు. ఈ క్రమంలో పని స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే 8 మంది కూలీలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీన్ని గమనించిన భూ యజమాని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సకాలంలో అక్కడికి అంబులెన్స్‌ చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.

ప్రస్తుతం వారు అనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ..అస్వస్థతకు గురైన రైతు కూలీలను సకాలంలో ఆసుపత్రికి తీసుకు రావడం వల్ల సరైన వైద్యం అందించామని, ప్రస్తుతం కూలీలంతా కోలుకుంటున్నారని తెలిపారు.

Tags:    

Similar News