జగన్ లాంటి సీఎంను ఎప్పుడు చూడలేదు: సీఎం చంద్రబాబు నాయుడు

మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడికి వెళ్లిన 2019-2024 లో పరదాల చాటున వెళ్లేవాడు.

Update: 2024-09-20 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ (Former CM Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడికి వెళ్లిన 2019-2024 లో పరదాల చాటున వెళ్లేవాడు. 2019-2024 మధ్య కాలంలో చూసినటువంటి సీఎంను నేను ఎప్పుడూ చూడలేదని.. సీఎం జగన్ ను చూస్తే ఆశ్చర్యంగా అనిపించేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చెప్పుకొచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా అంటూ ప్రకాశ జిల్లా పర్యటన(Prakasa district tour)లో భాగంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రూ.4 వేలకు పెన్షన్ పెంచామని.. ఒకేసారి రూ.2వేల పెన్షన్‌ పెంచింది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నాం. వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. గతంలో వైసీపీ సమావేశాలకు డ్వాక్రా మహిళలను లాక్కొని వెళ్లేవారు. మహిళలు వైసీపీ సభలు, సమావేశాలకు రాకపోతే పెన్షన్లు, రేషన్‌లో కోత పెట్టే పరిస్థితి ఉండేదని.. ఎన్డీయే కూటమి "ఇది మంచి ప్రభుత్వం" (It is good government) కార్యక్రమంలో భాగంగా మద్దిరాలపాడులో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.


Similar News