AP Pensions:పెన్షన్ల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(శుక్రవారం) ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు.

Update: 2024-09-20 12:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(శుక్రవారం) ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అక్టోబర్ నుంచి కొత్త వారికి పెన్షన్లు(Pensions) అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో చాలామంది అనర్హులు పెన్షన్లు తీసుకున్నారని తెలిపారు. అక్టోబరు నుంచి గ్రామ సభలు పెట్టి అర్హులకే పెన్షన్(Ineligible pensions) అందిస్తాం అన్నారు. వచ్చే నెల మొత్తం ఇదే కార్యక్రమం నిర్వహిస్తాం అని తెలిపారు. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, దివ్యాంగుల పరిస్థితిని చూసి పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


Similar News