AP:‘ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం’.. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కీలక వ్యాఖ్యలు

జీలుగుమిల్లి మండలం పి.రాజవరం గ్రామంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమంలో జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిథిలుగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు.

Update: 2024-09-20 11:34 GMT

దిశ, జీలుగుమిల్లి: జీలుగుమిల్లి మండలం పి.రాజవరం గ్రామంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమంలో జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిథిలుగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. వారికి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ 1000 రూపాయల పెన్షన్ పెంపు, 16,437 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు చెల్లింపు, మూడు మండలాల్లో వచ్చిన వరదలకు కూటమి ఆధ్వర్యంలో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు, వంట సామాగ్రి, పంపిణీ ప్రజలను పునరావాస ప్రాంతాలకు చేర్చడం నియోజకవర్గంలో పలు రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీల, శంకుస్థాపన అలాగే దీపావళి కానుకగా గృహిణిలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.

అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, టీడీపీ సీనియర్ నాయకుడు పారేపల్లి రామారావు, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవల్లి సాయి, బీజేపీ మండల అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ ఎంపీటీసీ నాలీ శ్రీను, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, దొంగ మురళి, సూరిశెట్టి మహేష్, జాస్తి సత్యనారాయణ, గూడపాటి పుల్లారావు, ఉప్పులూరు శ్రీను, వెలగల అజయ్, జల్లా వీరాస్వామి, కర్రీ మహేష్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.


Similar News