Somireddy: వైసీపీలో ఇక మిగిలేది ఆ ఇద్దరే.. మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీలో ఇక మిగిలేది వైఎస్ జగన్, భారతి మాత్రమేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-19 09:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP)లో ఇక మిగిలేది వైఎస్ జగన్ (YS Jagan), భారతి (Bharathi) మాత్రమేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన అమరావతి (Amaravathi)లోని ఎన్టీఆర్ భవన్‌ (NTR Bhavan)లో మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. నేడు మళ్లీ అదే వైసీపీ రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాకుండా సంకుచితంగా ఆలోచించి కుట్రలకు తెర లేపారని మండిపడ్డారు. అమరావతి (Amaravathi) ప్రాంతం సముద్ర మట్టానికి 35 మీటర్ల ఎత్తులో ఉందని, ఇక్కడ భవిష్యత్తులో నెలకొల్పబోయే పరిశ్రమలకు ఎలాంటి ఉపద్రవం రాబోదని స్పష్టం చేశారు.

తిరిగి రాజధాని అమరావతిలో యథావిధిగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కొనసాగుతోన్న తీరు వైసీపీకి ఏమాత్రం మింగుడుపడటం లేదని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌‌రెడ్డి (Former Minister Kakani Govardhan Reddy) సీఎం చంద్రబాబు (CM Chandrababu)పై అవాకులు చెవాకులు పేలుతున్నారని.. ఇక నుంచి సీఎం గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో జగన్ నిరంకుశత్వాన్ని భరించలేక వరుసగా వైసీపీ నుంచి నాయకులు ఇతర పార్టీలోకి క్యూ కడుతున్నారని ఎద్దేవా చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే చివరకు ఆ పార్టీలో మిగిలేది వైఎస్ జగన్ (YS Jagan) ఆయన భార్య భారతి మాత్రమేనని సోమిరెడ్డి జోస్యం చెప్పారు. 


Similar News