హత్య కేసులో సంచలనం.. ఆ శరీర భాగాలు హిజ్రావి!?
ఏపీలో నిన్న వెలుగుచూసిన కిరాతక హత్య కేసు సంచలనం రేకెత్తిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో నిన్న వెలుగుచూసిన కిరాతక హత్య కేసు సంచలనం రేకెత్తిస్తోంది. బయ్యవరం బ్రిడ్జి కింద నిన్న రెండు కాళ్లు, చేతులు బెడ్ షీట్లో చుట్టి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, ఆ శరీర భాగాలు ఓ హిజ్రావిగా గుర్తించారు. అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో ఇవాళ తల, మొండెం దొరికాయి. మిగిలిన శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. హత్యకు గురైంది హిజ్రాగా నిర్థారణకు వచ్చారు. పోలీసులు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చనిపోయిన వ్యక్తి హిజ్రా దిలీప్ అలియాస్ రూపగా అని గుర్తించారు. బన్నీ అనే వ్యక్తితో నాలుగేళ్లుగా మునగపాక మండలం నాగులపల్లిలో హిజ్రా నివాసం ఉంటోంది. ఈ విషయాన్ని దీప తోటి హిజ్రాలకు కూడా చెప్పలేదు. చాలాకాలంగా హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంటోంది. ఎవరు చంపారు.. ఎందుకు ఇంత కిరాతంగా హత్య చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది.
సీఎం చంద్రబాబు ఆరా..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసు విషయమై ఢిల్లీ నుంచి అనకాపల్లి ఎస్పీకి ఫోన్ చేశారు. ట్రాన్స్‌జెండర్ హత్య వివరాలు తెలుసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సీఎం ఆదేశించగా, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అనకాపల్లి ఎస్పీ వివరించారు.