యాంకర్ శ్యామలకు ఊరట.. అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం

సినీ, టీవీ యాంకర్ శ్యామలకు ఊరట లభించింది...

Update: 2025-03-21 12:07 GMT
యాంకర్ శ్యామలకు ఊరట.. అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సినీ, టీవీ యాంకర్ శ్యామల(Anchor Syamala)కు ఊరట లభించింది. బెట్టింగ్ యాప్స్(Betting App) ప్రమోట్ చేశారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేయవద్దని యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం యాంకర్ శ్యామల పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. శ్యామలను అరెస్ట్ చేయవద్దని, నోలీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సోమవారం పోలీసు విచారణకు హాజరుకావాలని శ్యామలకు సూచించింది. అలాగే విచారణకు సహకరించాలని యాంకర్‌ శ్యామలకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు పోతున్న ఘటనలపై సీరియస్ యాక్షన్‌కు దిగారు. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ మేరకు పలువురిని విచారించారు. ఇప్పటికే విష్ణు ప్రియ, రీతూ చౌదరి, తేస్టీ తేజ, కిరణ్ గౌడ్‌ను విచారించారు. అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్‌ను విచారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టులో యాంకర్ శ్యామల పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News