హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐపీఎల్ 2025 మెగా టోర్నీ.. శనివారం సాయంత్రం కోల్‌కత్తా వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు (Cricket fans) ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐపీఎల్ 2025 మెగా టోర్నీ.. శనివారం సాయంత్రం కోల్‌కత్తా వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. కాగా ఈ రోజు రెండో మ్యాచ్ (Second match) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో జరగనుంది. నేడు ఆదివారం హాలీడే కావడంతో హైదరాబాద్ నగరం (Hyderabad city) దద్దరిల్లనుంది. గత సీజన్లో సన్ రైజర్స్ జట్టు విజృంభించి ఆడడంతో ఈ సంవత్సరం ఆరెంజ్ ఆర్మీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచుల టికెట్ల కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఈ క్రమంలో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలు దద్దరిల్లనున్నాయి.
ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. 12 గంటల నుంచి ఫ్యాన్స్ స్టేడియం పరిసర ప్రాంతాలకు చేరుకోనున్నారు. దీంతో ఉప్పల్ స్టేడియం వైపు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఈ రోజు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను హబ్సిగూడ X రోడ్ నుంచి మళ్లిస్తున్నారు. అలాగే రామంతపూర్ నుంచి వచ్చే వాహనాలను స్ట్రీట్ నెం.8 నుంచి ఉప్పల్ X రోడ్డు వైపు మళ్లిస్తున్నారు. అయితే ఉప్పల్ స్టేడియానికి నేరుగా మెట్రో అందుబాటులో ఉండటం తో సొంత వాహనాలను కాకుండా మెట్రోను ఆర్టీసీ సేవలను క్రికెట్ అభిమానులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.