నటుడు పోసాని కృష్ణమురళికి భారీ ఊరట
ఎట్టకేలకు ప్రముఖ సినీ నటుడు, వైసీపీ(YCP) నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి భారీ ఊరట దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు ప్రముఖ సినీ నటుడు, వైసీపీ(YCP) నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి భారీ ఊరట దక్కింది. సీఐడీ(CID) కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. శుక్రవారం గుంటూరు జిల్లాలోని సీఐడీ కోర్టు(Guntur CID Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh)పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ తదితరులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రదర్శించిన పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గతేడాది అక్టోబరు 9న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.