వాహనదారులకు ఊరట.. రాష్ట్ర హోంశాఖ కీలక ప్రకటన

వాహనదారుల హెల్మెట్ డ్రైవ్‌పై రాష్ట్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది..

Update: 2025-03-21 11:39 GMT
వాహనదారులకు ఊరట.. రాష్ట్ర హోంశాఖ కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: నేరాల(Crimes) నియంత్రణలో టెక్నాలజీ కీలకమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Minister Vangalapudi Anitha) అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల(law and order)పై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడే విషయంలో రాజీపడొద్దని పోలీసులకు సూచించారు. చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి 3 నెలలకోసారి శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష జరగాలన్నారు. పటిష్ట భద్రతతో శాసనసభ సమావేశాల నిర్వహణ అభినందనీయమని ప్రశంసించారు. కలెక్టర్ల సదస్సును కూడా సమర్థవంతంగా నిర్వహిద్దామని చెప్పారు. నేరం జరగ్గానే నిందితులను పట్టుకోవడం మంచి పరిణామమని చెప్పారు. 'హెల్మెట్' ధరించని వారిపట్ల సున్నితంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశించారు. అవసరమైనచోట కఠినంగా ఉంటూనే కొన్నిచోట్ల పట్టువిడుపుతో వ్యవహరించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పోలీసులు నిర్వహిస్తున్న హెల్మెట్ డ్రైవ్‌ను ఆమె ప్రశంసించారు. అలాగే రాష్ట్రంలో రౌడీయిజాన్ని తగ్గించే దిశగా కృషి చేయాలని చెప్పారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. 

Tags:    

Similar News