Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District) మనుబోలు మండలం వడ్లపూడి(Vadlapudi)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో(Auto)ను బైక్(Byke) ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు వరుణ్, నందకిషోర్, సురేంద్రగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులకు స్థానికులు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలను అతివేగంగా నడపొద్దని వాహదారులకు పోలీసులు సూచించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీప్పవని హెచ్చరించారు. వాహనదారులు కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచించారు.