తీవ్ర ఉద్రిక్తత.. సీఐపై రాళ్లు, కర్రలతో దాడి

సీఐతో పాటు పోలీసులపై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన ఉద్రిక్త సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2025-03-25 03:04 GMT
తీవ్ర ఉద్రిక్తత.. సీఐపై రాళ్లు, కర్రలతో దాడి
  • whatsapp icon

దిశ, దిశ డైనమిక్ బ్యూరో, వెబ్ డెస్క్: సీఐతో పాటు పోలీసులపై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన ఉద్రిక్త సంఘటన (Tense incident) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిరంగిపురం శాంతినగర్‌లో ఉన్న ఓ కమిటీహాల్ మూడు సెంట్ల స్థలం కబ్జా చేశారని చిన్ని కృష్ణ అనే వ్యక్తి కుటుంబం పై గ్రామస్తులు ఆరోపిస్తూ.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు (police) అక్కడికి చేరుకుని.. విచారిస్తుండగా ఓ యువకుడు వీడియో తీస్తుండటంతో పోలీసులు అతనిపై దాడి చేశారు. దీంతో పోలీసుల దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆగ్రహం తో ఊగిపోయారు.

ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల (Villagers) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొని ఉద్రిక్త వాతావరణ (Tense atmosphere) నెలకొంది. ఆ సమయంలో సీఐ (CI) గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించడంతో గ్రామస్తులు అతనిపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. అలాగే పోలీసుల వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. చేతిలో తుపాకి పట్టుకొని బెదిరించిన సీఐ ని కర్రలతో తరిమి కొట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం గ్రామస్తుడిపై దాడి చేసిన పోలీసులు, సీఐ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు జాతీయ రహదారిపై టైర్లను తగలబెట్టి నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో ఆ గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.

Similar News