ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన
టిడ్కో ఇళ్లకోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు మంత్రి నిమ్మల రామానాయుడు గుడ్ న్యూస్ తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: టిడ్కో ఇళ్ల(Tidco houses) కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల(Beneficiaries)కు మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) గుడ్ న్యూస్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు(Palakollu)లో టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. 2014-19లో తామే టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, ఆ తర్వాత వచ్చిన జగన్ గవర్నమెంట్ వాటిని పూర్తి చేయకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. అంతేకాకుండా టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రూ. 5 వేల కోట్లను రుణం తీసుకుని.. పక్కదారి పట్టించారని ఆరోపించారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, ఆ భారం కూటమి ప్రభుత్వంపై పడిందని నిమ్మల వ్యాఖ్యలు చేశారు.

కాగా టీడీపీ ప్రభుత్వం 2014-19లో 7,01,481 టిడ్కో ఇళ్లను కేంద్రంతో రాష్ట్రానికి మంజూరు చేయించింది. వాటిలో 5 లక్షల గృహాలకు పరిపలనా అనుమతులు లభించాయి. 4 లక్షల 54 వేల 706 ఇళ్లలను గ్రౌండ్ చేశారు. 2019 నాటికి 3 లక్షల13 వేల 382 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించించింది. అయితే ప్రభుత్వం మారడంతో ఇళ్ల నిర్మాణంలో గందరగోళం ఏర్పడింది. 2,61,640 ఇళ్లకు మాత్రమే జగన్ సర్కార్ నిర్మాణ పనులు చేపట్టింది. మిగిలిన వాటిని రద్దు చేసింది. 77 వేల ఇళ్లను పూర్తి చేసింది. లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లపైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. ఆ సొమ్మును డైవర్ట్ చేసింది. రూ.102 కోట్ల మేర అప్పు చేసింది. ఈ అప్పులను బ్యాంకులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్లియర్ చేసింది. దాదాపు 1.18 లక్ష ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల పంపిణీపై కీలక ప్రకటన చేశారు.