PM Modi: ముందుగా ఆ స్వామికి నమస్కరిస్తున్నా..

విశాఖలో పలు కీలక ప్రాజెక్టులకు పీఎమ్ మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు...

Update: 2025-01-08 13:32 GMT

దిశ, వెబ్ డెస్క్: రూ. 2లక్షల విలువైన ప్రాజెక్టులకు విశాఖ(Vishaka)లో పీఎమ్ మోడీ(Pm Modi) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏయూలో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగు(Telugu)లో మోడీ ప్రసంగించారు. ‘‘ముందుగా వరహ లక్ష్మీనరసింహ స్వామికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రజల ఆశీర్వాదంతో మూడో సారి కూడా కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చింది. ఏపీతో కలిసి నడుస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి విషయాన్ని గౌరవిస్తున్నా. ఆయన లక్ష్యాలకు అండగా ఉంటాం. ప్రజల విశ్వాసానికి నేను కట్టుబడి ఉంటా. ఏపీపై అభిమానం చూపే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఏపీపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. 2047 నాటికి రెండున్నర ట్రిలియన్ డాలర్ల లక్ష్యం పెట్టుకున్నాం. దేశంలో 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించాం. 2030 నాటి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను మన దేశంలో ఉత్పత్తి చేయాలి.’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Tags:    

Similar News