EO Shyamala Rao: తిరుపతి తొక్కిసలాట ఘటన.. ఈవో శ్యామల రావు కీలక ప్రకటన

తిరుపతి (Tirupati)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై తాజాగా ఈవో శ్యామల రావు (EO Shyamala Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-09 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై తాజాగా ఈవో శ్యామల రావు (EO Shyamala Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బైరాగిపట్టెడ (Bairagipatteda) వద్ద ఉన్న బారికేడ్లు నిర్లక్ష్యంగా తెరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లుగా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా డీఎస్పీ రమణ కుమార్ (DSP Ramana Kumar) బారికేడ్లు అడ్డు తొలగించినట్లుగా తెలిసిందని అన్నారు. పూర్తి స్థాయి విచారణ తరువాతే తొక్కిసలాటకు గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అదేవిధంగా ఈ దుర్ఘటనలో 41 మంది గాయపడగా.. అందులో 20 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని, కేవలం ముగ్గురికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని శ్యామల రావు తెలిపారు.   

Tags:    

Similar News