Tirumala: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తి.. కౌంటర్లు మూసివేత
తిరుమల తిరుపతి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ ప్రక్రియ బుధవారం సాయంత్రం ప్రారంభమై గురువారం ఉదయం 10.30 గంటలకు పూర్తయ్యింది.
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి(Tirumala Tirupati) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ ప్రక్రియ(Token Issuance Process) బుధవారం సాయంత్రం ప్రారంభమై గురువారం ఉదయం 10.30 గంటలకు పూర్తయ్యింది. కాగా టోకెన్ల జారీ ప్రక్రియ లో గురువారం రాత్రి సమయంలో తొక్కిసలాట జరగ్గా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తొక్కిసలాట ఘటన అనంతరం వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, టీటీడీ అధికారులు(TTD officials) పరిస్థితులను చక్కదిద్దారు. అనంతరం టోకెన్ల జారీ ప్రక్రియను కొనసాగించారు. దీంతో గురువారం ఉదయం.. కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేసినట్లు టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు. మూడు రోజు వైకుంఠ ద్వార దర్శనాల కొరకు మొత్తం లక్షా 20 వేల టోకెన్లు జారీ చేశారు. రోజుకు 40 వేల చొప్పున టోకెన్లు జారీ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే 13వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లను తిరిగి జారీ చేయనున్నారు.