తిరుమల తొక్కిసలాటపై స్పందించిన తిరుపతి జిల్లా కలెక్టర్
బుధవారం రాత్రి తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: బుధవారం రాత్రి తిరుమలలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు మృతి(Six people died) చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ సంచలన ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్(Tirupati District Collector) ఎస్. వేంకటేశ్వర్లు(S. Venkateshwar) స్పందించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల గేట్లను ఒక్కసారిగా తెరవడంతో 2 వేల మంది ప్రజలు ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అదుపుతప్పి ఒకరిపై మరొకరు పడిపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు. అలాగే మొత్తం ఆరుగురు మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఉన్నారని, మిగిలిన ఐదుగురు వైజాగ్, నర్సీపట్నం కు చెందిన వారిగా గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. అలాగే తొక్కిసలాటలో గాయపడిన మరో 35 మంది భక్తులకు రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతుందన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వేంకటేశ్వర్లు మీడియాతో చెప్పుకొచ్చారు.