Raghuveera Reddy : ఆర్టీసీ బస్సులో మాజీ మంత్రి రఘువీరారెడ్డి
ఆయనొక మాజీ మంత్రి(Former Minister)..ఓ జాతీయ పార్టీ అత్యున్నత కమిటీ సభ్యులు(Members of the National Party Supreme Committee)..ఓ రాష్ట్రానికి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు(Former president of a state party) కూడా..అయితేనేం ఆయన కొన్నేళ్ల పాటు తనను ఎవరు గుర్తుపట్టనంతగా సాధారణ రైతు జీవితం గడుపుతూ సోంతూరికే పరిమితమయ్యాడు.
దిశ, వెబ్ డెస్క్ : ఆయనొక మాజీ మంత్రి(Former Minister)..ఓ జాతీయ పార్టీ అత్యున్నత కమిటీ సభ్యులు(Members of the National Party Supreme Committee)..ఓ రాష్ట్రానికి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు(Former president of a state party) కూడా..అయితేనేం ఆయన కొన్నేళ్ల పాటు తనను ఎవరు గుర్తుపట్టనంతగా సాధారణ రైతు జీవితం గడుపుతూ సోంతూరికే పరిమితమయ్యాడు. కొన్నాళ్ల క్రితం మళ్లీ క్రీయాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అయినప్పటికి తన సాధారణ లైఫ్ స్టైల్ ను మాత్రం వీడటం లేదు. ఆయన ఎవరో కాదు..అందరికి సుపరిచితుడైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సీడబ్ల్యుసీ సభ్యుడు ఎన్. రఘువీరారెడ్డి(Raghuveera Reddy).
నిరాడంబర వస్త్రధారణతో సాధారణ ప్రయాణికుడిలా రఘువీరారెడ్డి ఓ ఆర్టీసీ బస్సులో(Ordinary Passenger in RTC Bus) ప్రయాణిస్తుండగా..బస్సులోని ప్రయాణికులు ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. రఘువీరారెడ్డి తన స్వగ్రామం నీలకంఠాపురం చంద్రబావి గేట్ నుంచి బెంగళూరుకు సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారే కార్లు..విమానాల వంటి లగ్జరీ ప్రయాణాలు చేస్తున్న ఈ రోజుల్లో రఘువీరారెడ్డి వంటి నాయకుడు సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం అభినందనీయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రఘువీరారెడ్డి వంటి నాయకులు అరుదంటూ ఆయన నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు.
రఘువీరారెడ్డి 1989, 1999, 2004లో మడకశిర శాసన సభ్యుడిగా, 2009లో కల్యాణదుర్గం శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్ రెడి కేబినెట్ లో, రెండు పర్యాయాలు వైఎస్.రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో, అనంతరం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మొత్తం 11ఏండ్లకు పైగా మంత్రిగా రఘువీరారెడ్డి పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా రఘువీరారెడ్డి సారధ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో రాజకీయ సన్యాసం ప్రకటించి అనంతపురం జిల్లా మడకశిర మండలం స్వగ్రామం నీలకంఠపురంలో కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ జీవితానికి పరిమితమయ్యాడు.
గ్రామంలో దేవాలయం నిర్మాణం జరిపించి పొలం పనులతో గ్రామస్తులతో కలిసి జీవించాడు. కోడలి సీమంతానికి వచ్చిన గ్రామస్తుల ఎంగిలి విస్తరాకులు తీసి, మనవరాలితో డ్యాన్స్ లు, స్కూటర్ పైన, ఎండ్ల బండిపైన ప్రయాణాలు, నాన్న నడిపిన ట్రాక్టర్ తో పొలం పనులతో తన నిరాడంబర జీవన శైలితోనూ తరుచూ వార్తల్లో నిలిచారు. 2023 ఏప్రిల్ లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంతో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన రఘువీరారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా సీడబ్ల్యుసీ సభ్యుడిగా నియమించింది. ఏపీ 2024అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వర్తించినప్పటికి రాష్ట్ర విభజన పిదప వరుసగా మూడోసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.