AP News:చిరంజీవినే అవమానిస్తారా..? సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్..!
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండపేట బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిని అవమానించిన జగన్‌పై నిప్పులు చెరిగారు. మన అభిమాన హీరో చిరంజీవిని అవమానించిన జగన్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తామని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని, పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు కేటాయిస్తామని అన్నారు. పోలీస్ , రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. జగన్ నాయకత్వంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం రాష్ట్ర సంపదను దోచేస్తుందని విమర్శించారు.
ద్రాక్షారామంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణం చేపడతామని చెప్పి స్థలం కాజేసి రెండేళ్లుగా కళ్యాణ మండపం నిర్మించలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని జగన్ పాలన నుంచి విముక్తి చేయాలని ప్రజలను కోరారు. గంజాయి పండించే వైసీపీ నేతలు లాభాల్లో ఉన్నారని, మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 960 కోట్లు నష్టపోయారని పవన్ అన్నారు. మండపేట నియోజకవర్గంలో నాలుగు ఇసుక రీచ్‌ల నుంచి జగన్ నెలకు 10 కోట్లు దోచుకుంటున్నారని పవన్ విమర్శించారు. క్లాస్ వార్ అంటున్న జగన్ అందరి సంపద దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని, కూటమికి ఓటు వేసి అధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు.
Read More..
వైసీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి..సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు