Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టులో భారీ ఊరట.. బెయిల్ మంజూరు

మంగళగిరి (Mangalagiri)లోని టీడీపీ ప్రధాన కార్యాలయం (TDP Head Office)పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం (Former MP Nandigam Suresh) సురేష్‌కు భారీ ఊరట లభించింది.

Update: 2024-10-04 06:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంగళగిరి (Mangalagiri)లోని టీడీపీ ప్రధాన కార్యాలయం (TDP Head Office)పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం (Former MP Nandigam Suresh) సురేష్‌కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు తనకు బెయిల్ ఇవ్వాలంటూ రెండోసారి హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్‌‌ను మంజూరు చేసింది. ప్రస్తతం ఆయన పోలీసుల రిమాండ్‌లోనే ఉన్నారు. అదేవిధంగా ఇదే కేసులో విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డి‌కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం జైలు నుంచి నందిగం సురేష్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా, సెప్టెంబర్ 5న ఆయనను మంగళగిరి పోలీసు (Mangalagiri Police)లు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు నెల రోజుల తరువాత ఆయన జైలు నుంచి బయటకు రాబోతున్నారు. 


Similar News