Tragedy: ఇంటిపై బట్టలు ఆరవేసేందుకు వెళ్లి తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

బట్టలు ఆరేసేందుకు ఇంటిపైకి వెళ్లి తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది....

Update: 2024-12-09 14:17 GMT

దిశ, వెబ్ డెస్క్: బట్టలు ఆరేసేందుకు ఇంటిపైకి వెళ్లి తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. పెదబయలు మండలం గుడుగుపల్లికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రోజు మాదిరిగానే బట్టలు ఆరవేసేందుకు ఇంటిపైకి వెళ్లారు. బట్టలు ఆరేస్తు్న్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందారు. ఈ ఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతులు లక్ష్మి, సంతోష్, అంజలిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News