Visakha: ప్రధానికి, హోంమంత్రికి ఎమ్మెల్సీ బొత్స లేఖ
పాలనలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. ...
దిశ, వెబ్ డెస్క్: పాలనలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారని ఆయన ఆరోపించారు. తుఫాను కారణంగా పంటలు పూర్తి దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు. రైతు సమస్యలపై ఈ నెల 13న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపారని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఈ నెల 27 ఎస్ఈలకు వినతిపత్రం అందిస్తామని స్పష్టం చేశారు. విశాఖ కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని తొలుత ప్రచారం చేసి ఆ తర్వాత ఏమీ లేదని తేల్చారని బొత్స ఎద్దేవా చేశారు. విశాఖ డ్రగ్స్ రవాణాపై సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధానికి, హోంమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు.