AP News:మహిళలకు ఉచిత బస్సు పథకం పై ఎమ్మెల్యే కీలక ప్రకటన

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

Update: 2024-10-15 11:49 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. అయితే ఈ పథకం అమలు విషయమై ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఈ పథకం పై కీలక ప్రకటన చేశారు.

జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న‌ ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఇంకా పెన్షన్లు పెంచాలి. రేషన్‌ కార్డులు ఇవ్వాలి. ఎన్టీఆర్‌ గృహాలు ఇవ్వాలి. ఇంకా ఎన్నో ఇవ్వాలని వచ్చామని అన్నారు. ప్ర‌భుత్వం ఈ దీపావళి పండుగకు ఉచిత సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తుంద‌ని అన్నారు. అలాగే దీపావళి మ‌రుస‌టి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు దీపావళికి డబుల్‌ ధమాకా అంటూ వ్యాఖ్యానించారు.


Similar News