AP Cabinet meeting:రేపు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చలు

ఏపీ సచివాలయంలో రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

Update: 2024-10-15 12:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయంలో రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాలు రీ షెడ్యూల్ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు పై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు చెత్త పన్ను రద్దు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనలపై మంత్రి వర్గం చర్చలు జరపనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులు సభ్యులుగా నియమించే అంశంపై, దీపావళి నుంచి ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చలు జరుగనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News