బూమ్ బూమ్ బీర్లను ఇప్పటికే నిలిపివేశాం
గత వైసీపీ(YCP) పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ(Excise Department)ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: గత వైసీపీ(YCP) పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ(Excise Department)ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అక్రమ మద్యం విధానం అమలు కోసం గత సర్కార్ సెబ్‌ను పెట్టిందని గుర్తుచేశారు. నకిలీ మద్యం బ్రాండ్లతో ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. J బ్రాండ్ల కోసం డిస్టలరీలను కూడా వైపీసీ తన చేతుల్లోకి తీసుకుందని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బూమ్ బూమ్ లాంటి బ్రాండ్లను నిలిపివేశామని అన్నారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి కల్లుగీత కార్మికులకు 10 శాతం దుకాణాలు ఇవ్వబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని, కేబినెట్‌లో తమ నివేదికలను సమర్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పాలకుల జేబుల్లోకి వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హత లేని వ్యక్తిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి వ్యవస్థను భ్రష్టుపట్టించారు. నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని తెలిపారు.