హిందీ అమ్మాయితో పెళ్ళి.. రష్యన్‌తో పిల్లలు: పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-01 12:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పవన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ''బాబూ నిత్య కల్యాణ్‌.. చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ.. మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే.. అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్‌ జీవిత చరిత్ర బాగా చదువుకో!.. బీజేపీతో వివాహం.. చంద్రబాబుతో సంసారం.. హిందీ అమ్మాయితో పెళ్ళి... రష్యన్‌తో పిల్లలు.. అన్న పరువు బజారు పాలు, తండ్రి పరువు బుగ్గి పాలు'' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదివే గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లీష్‌ మీడియం పెట్టటానికి వీల్లేదని.. అమరావతి భూముల్ని పేదలకు పంచితే సామాజిక అసమతౌల్యం వస్తుందని వాదించిన బాబు బ్యాచ్‌ది క్లాస్‌ వార్‌ కదా? అని ప్రశ్నించారు. కాగా, మంత్రి ట్వీట్‌పై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఏంటని మంత్రి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News