పవన్ అలా చేస్తే రాజీనామా చేస్తా: Minister Amarnath

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి అమర్ నాథ్ సవాల్ విసిరారు..

Update: 2023-12-08 12:49 GMT

దిశ, వెబ్ డెస్క్:  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి అమర్ నాథ్ సవాల్ విసిరారు. ఇన్ఫోసిస్‌ది శాటిలైట్ సెంటర్ అని నిరుపిస్తే తాను రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. ఇస్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్‌పై పవన్ కల్యాణ్, జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అమర్‌నాథ్ స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన  ఇస్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌పై  పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ఉన్నది ఇన్ఫోసిస్‌కు చెందిన డెవలప్‌మెంట్ సెంటర్ మాత్రమే ఉందని చెప్పారు. శాటి‌లైట్ సెంటర్ మాత్రం కాదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇన్ఫోసిస్‌ది నాలుగో స్థానంలో మంత్రి తెలిపారు. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖపై పవన్  విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీతో జనసేన పొత్తుపైనా విమర్శలు

ఇక టీడీపీతో జనసేన పొత్తుపైనా అమర్‌నాథ్ విమర్శలు కురిపించారు. కులం కార్డును బేస్ చేసుకుని పవన్ రాజకీయాలు నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. పొలిటికల్ కాంట్రాక్ట్‌ల కోసమే పవన్ కల్యాణ్ జనసేన  పార్టీ పెట్టారని ఆరోపించారు. అఫీషియల్‌గా బీజేపీతో అన్ అఫీయల్‌గా టీడీపీతో పవన్‌కు పొత్తు ఉందని మంత్రి అమర్‌నాథ్ విమర్శలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొలిటికల్ కాంట్రాక్ట్ తీసుకున్నారని, వచ్చే ఎన్నికల కోసం ఏపీలో చంద్రబాబు తీసుకున్నారని మంత్రి అమర్‌నాథ్ విమర్శించారు. 


Similar News