కోస్తాంధ్రకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. ఈ నెల 5 వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

గత మూడ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-02 03:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత మూడ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్ని అస్తవ్యస్తంగా మారిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లన్ని నీట మునిగాయి. అధికారులు దగ్గరుండి మరీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాత భవనాలు కూలిపోతున్నాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ తెగిపోవడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కుండపోత వర్షం నేడు కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో తెలుగు ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాతావరణశాఖ కోస్తా జిల్లా వారికి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల (సెప్టెంబరు)5 వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వాన పడనుందని తెలిపింది. కాగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అమరావతి పోలీస్ స్టేషన్‌లో వరద నీరు 4 అడుగుల మేర నిలిచింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం ఒడిశా, ఛత్తీష్‌గఢ్, విదర్భ మీదుగా పయనిస్తుంది. రాగల 12 గంటల్లో వాయుగుండం మరింత బలహీనపడనుందని వాతావరణశాఖ పేర్కొంది.  


Similar News