Rain alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. కొనసాగుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో గత రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి.
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి. ఈ క్రమంలో వరదలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. కాగా ఈ అల్ప పీడనం ఒడిశా పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉండగా.. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దీని ప్రభావంతో కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం కారణంగా.. తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. వీటి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.