Rain Effect: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. నీటిమట్టం ఎంతంటే..!

శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది...

Update: 2024-07-20 04:34 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం ఇన్ ఫ్లో 37,265 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగుల కాగా ప్రస్తుతం 810. 90లకు వరద నీరు చేరింది. దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో శ్రీశైలం డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు మరింత వరద నీరు పెరిగితే గేట్లు ఎత్తి దిగువ వదిలేందుకు చర్యలు చేపడుతున్నారు. 

Read More..

విజయవాడలో వర్షం బీభత్సం.. కొండరాయి పడి ఇల్లు ధ్వంసం 

Tags:    

Similar News