Kurnool: సంగమేశ్వరుడిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అభయారణ్య ప్రాంత పరిధిలో సప్తనదుల సంగమ తీరమైన సంగమేశ్వర క్షేత్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సందర్శించారు.
దిశ, కర్నూలు ప్రతినిధి: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అభయారణ్య ప్రాంత పరిధిలో సప్తనదుల సంగమ తీరమైన సంగమేశ్వర క్షేత్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ సాంప్రదాయాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వేపదారు శివలింగానికి, దిగువనున్న భీమారతి శివలింగాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాశస్తం, చరిత్ర తదితర విషయాలను పురోహితుడిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎగువ ఉమా మహేశ్వర ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నేతి మిఠాయిలకు పేరుగాంచిన జి.పుల్లారెడ్డి స్వగ్రామమైన గోకవరంలోని ఏకలవ్య పాఠశాలలో పార్టీ కార్యకర్తలతో సమీక్షించారు. అక్కడ విలువిద్యకు సంబంధించిన ఆటల గురించి అడిగి తెలుసుకుని అక్కడే భోజనం చేసి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఆయన రాక సందర్భంగా అనువణువునా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. సంగమేశ్వరం నుంచి కర్నూలు, ఓర్వకల్ విమానాశ్రయం వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర అడుగడుగునా పోలీసులు మోహరించారు.