Nandyala: జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ

నంద్యాల జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ తెలిపారు...

Update: 2023-06-02 15:52 GMT

దిశ, నంద్యాల: జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో 2023-24 సంవత్సరానికి నూతన జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల కాలపరిమితితో జిల్లాలోని జర్నలిస్ట్‌లకు అక్రిడేషన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ జీవో నెం.38 జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐ అండ్‌ పి ఆర్‌ ) డిపార్ట్‌మెంట్‌ తేదీ. 30.03.2023 ప్రకారం జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం పూర్తి చేసిన వారికి మొదటి విడతలో 305 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Tags:    

Similar News