Bitter Experience: ఒక్కటైన వాలంటీర్లు.. వెనుదిరిగిన ఎమ్మెల్యే ఆర్థర్

నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండల పరిధిలోని నెహ్రూనగర్‌లో గడపగడప‌కు మన ప్రభుత్వం కార్యక్రమాని గ్రామ వాలంటరీలు బహిష్కరించి విధులకు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ..

Update: 2023-02-02 14:19 GMT
  • గడపగడపకు మన ప్రభుత్వం కార్యకరమం బహిష్కరణ
  • వెనుదిరిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆర్థర్
  • జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
  • స్థానిక ప్రభుత్వాధికారులపై ఆగ్రహం

దిశ, నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండల పరిధిలోని నెహ్రూనగర్‌లో గడపగడప‌కు మన ప్రభుత్వం కార్యక్రమాని గ్రామ వాలంటరీలు బహిష్కరించి విధులకు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో గడపగడప కార్యక్రమం వాయిదా పడింది. ఈ సంఘటన రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం బహిష్కరించడం పట్ల ప్రభుత్వాన్ని అవమానించడం అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వెను తిరిగి వెళ్లిపోయారు.

పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్ సచివాలయం1 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహంచేందుకు ఎమ్మెల్యే ఆర్థర్ అక్కడకు వెళ్లారు. అయితే గ్రామ వాలంటీర్లు ఎవరూ రాకపోవడంతో సచివాలయంలోనే ఎదురు చూశారు. ఎంపీడీఓ వెంకటరమణను ఏం జరిగిందని అడిగితే వాలంటీర్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన గడపగడపను వాలంటరీలు బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వాలంటరీలకు రూ.5 వేలు గౌరవ వేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాన్ని బహిష్కరించిన సంఘటన పైన జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా వైసీపీ ప్రభుత్వానికి సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ రెండు కళ్ళుగా సీఎం జగన్ భావిస్తారు. అయితే ఇలాంటి ఘటనలతో ఆయన ఆశయానికి కొందరు తూట్లు పొడుస్తున్నాయనే చర్చ కూడా సాగుతోంది. వైసీపీ నాయకుల మధ్య నెలకొన్న రాజకీయ వర్గ విభేదాలు ప్రభుత్వానికి నష్టం చేసేలా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

Tags:    

Similar News