Kurnool: టెన్త్ సప్లమెంటరీ రాస్తున్నారా.. ఇవి కచ్చితంగా పాటించాల్సిందే..?

పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ....

Update: 2023-05-31 16:44 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కర్నూలు డీఆర్ఓ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి 10వ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 61 పరీక్ష కేంద్రాలలో 11,౫౩౫ మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రంగారెడ్డిని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థులతో పాటు విధులు నిర్వహించే సిబ్బంది కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీస్ అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు బందోబస్తు కల్పించాలన్నారు. దూర ప్రాంతాల విద్యార్థులకు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు సరైన సమయంలో చేరేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్షల అనంతరం రాసిన జవాబు పత్రాలను సరైన రీతిలో ప్యాక్ చేసి పంపేలా చర్యలు తీసుకోవాలని పోస్టల్ సిబ్బందికి సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పరీక్ష కేంద్రాల వద్ద తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తో పాటు ఏఎన్ఎం ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పరీక్ష రాయడానికి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడంతో పాటు పరీక్ష కేంద్రాల పరిసరాలలో జిరాక్స, నెట్ సెంటర్లను మూసి ఉంచేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు.

అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి రంగారెడ్డి మాట్లాడుతూ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 61 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా వాటికి అనుగుణంగా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 61 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 03, ఇన్విజిలేటర్స్ 610 మందికి విధులు కేటాయించడంతో పాటు స్టోరేజ్ పాయింట్స్ 27 గుర్తించినట్లు తెలియజేశారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ చంద్రభుషణం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

Tags:    

Similar News