Kurnool: చంటిపిల్లతో వచ్చి జేసీగా బాధ్యతలు

జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు, స్పందనలో వచ్చే రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని కర్నూలు జిల్లా నూతన జాయింట్ కలెక్టర నారపురెడ్డి మౌర్య అన్నారు. ...

Update: 2023-04-12 16:20 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి: జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు, స్పందనలో వచ్చే రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని కర్నూలు జిల్లా నూతన జాయింట్ కలెక్టర నారపురెడ్డి మౌర్య అన్నారు. చంటిపిల్లతో వెళ్లి జాయింట్ కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా పని చేసిన అనుభవం ఉండడం వల్ల జిల్లాలో ఉన్న సమస్యలపై మంచి అవగాహన ఉందన్నారు. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కూడా కొంతకాలం పని చేశానని, కొంతకాలం మెటర్నిటీ లీవ్‌లో వెళ్లినట్లు చెప్పారు. మే 12 వరకు సెలవులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా ఉత్తర్వులు ఇచ్చినందున విధులకు హాజరైనట్లు తెలిపారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు, స్పందనలో వచ్చే రెవెన్యూ సమస్యలు, ఆర్‌వోఆర్ కేసులపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, పిటిషనర్లు తమ సమస్యలు తెలుపుకోవచ్చన్నారు. అంతకుముందు నూతన జేసీకి డీఆర్వో నాగేశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

Tags:    

Similar News