కియాలో 150 మంది డోన్ వాసులకు ఉద్యోగాలు

స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ..

Update: 2024-01-03 17:15 GMT

దిశ, డోన్: స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. రూ.8 లక్షలతో ప్యాపిలి పట్టణంలో తీర్చిదిద్దిన బీ.పి శేషారెడ్డి నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ప్యాపిలి మహిళలకు స్వయం ఉపాధితో మరింత రాణించేందుకే నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 60 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కుట్టుమిషన్ లో శిక్షణ పొంది..అనతి కాలంలోనే ఉద్యోగం పొంది స్వశక్తితో ఎదిగే అవకాశం అందరికీ దక్కాలన్నదే ధ్యేయమన్నారు. నంద్యాల జిల్లాలో ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలు, ఐటీఐ, పాలిటెక్నిక్ , జాబ్ మేళాలు, స్కిల్ కనెక్ట్ డ్రైవ్‌లు నిర్వహించి గత నాలుగున్నరేళ్లలో సుమారు 5వేల మంది యువతీయువకులకి ఉద్యోగాలిచ్చినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.


డోన్ పట్టణంలో పరిశ్రమల శాఖకు సంబంధించిన రెండు షెడ్లను టీడీపీ నాయకులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తే నిలువరించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆ ప్రాంగంణంలోనే మహిళలకు ఉపయోగపడే ఫ్యాషన్ డిజైన్ శిక్షణ అందించి వస్త్రాల తయారీ కేంద్రంగా మార్చామన్నారు. డోన్ నుంచి 150 మంది యువతీయువకులు కియా పరిశ్రమలో ఉద్యోగావకాశాలు పొందినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి పీజీ చదివిన వారందరికీ శిక్షణ అందించి ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పారు. డోన్ యువతకు ఉద్యోగాలు కావాలంటే 3 నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తే చాలని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. 

Tags:    

Similar News