IT Notices: మంత్రి జయరాంకు ఐటీ షాక్.. సతీమణి రేణుకమ్మకూ నోటీసులు

మంత్రి గుమ్మనూరు జయరాంకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఇట్టినా భూమలు వ్యవహారంలో 11 నోటీసులు జారీ చేశారు. మంత్రి జయరాంతో పాటు ఆయన సతీమణి రేణుకమ్మకూ నోటీసులు జారీ చేశారు...

Update: 2023-03-02 13:06 GMT

దిశ, వెబ్ డెస్క్: మంత్రి గుమ్మనూరు జయరాంకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఇట్టినా భూమలు వ్యవహారంలో నోటీసులు జారీ చేశారు. మంత్రి జయరాంతో పాటు ఆయన సతీమణి రేణుకమ్మకూ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 3న జరిగే వీడియో కాన్ఫరన్స్ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా మంత్రి జయరాం సతీమణి రేణుకమ్మ కర్నూలు జిల్లా ఆస్పరిలో ఇట్టినా కంపెనీ నుంచి 30.83 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.52 లక్షల 42 వేలు లెక్కచూపడం లేదని ఐటీ అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. జయరాం సతీమణి బంధువుల పేర్లతో ఒకే రోజు 15 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఐటీ అధికారులు జారీ చేసిన నోటీసులపై ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా  మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News