Breaking: భూమా అఖిలప్రియకు రిమాండ్, జైలుకు తరలింపు
మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిలప్రియకు కోర్టు 14 రోజలు రిమాండ్ విధించింది. అఖిలప్రియతో పాటు భార్గవ రామ్‌కు సైతం రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది...
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిలప్రియకు కోర్టు 14 రోజలు రిమాండ్ విధించింది. అఖిలప్రియతో పాటు భార్గవ రామ్‌కు సైతం రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రాత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నారు. ఈ ఘర్షణల్లో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో భూమా అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఈ మేరకు భూమా అఖిలప్రియతో పాటు భార్గవ్ రామ్‌ను పోలీసులు ఆళ్లగడ్డలో అరెస్ట్ చేసి పాణ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే వీరికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అఖిలప్రియతో పాటు భార్గవ్ రామ్‌ను పోలీసులు జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి: