Kurnool: 367 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు

కర్నూలు జిల్లాలో అర్హత కలిగిన 367 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్జి సృజన తెలిపారు.

Update: 2023-06-03 14:32 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి: కర్నూలు జిల్లాలో అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు 367 అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసినట్లు కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ జి.సృజన తెలిపారు. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశంలో చర్చించిన మేరకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను అనుసరించి పాత్రికేయులకు కార్డులు మంజూరు చేశామన్నారు. అక్రిడేషన్ మంజూరు కాని వారు  సంబంధిత డాక్యుమెంట్లు అన్ని ఆన్ లైన్ ద్వారా సమర్పిస్తే తదుపరి కమిటీ సమావేశంలో పరిశీలించి అక్రిడిటేషన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి:

Ap Politics: బీజేపీ పెద్దలతో చంద్రబాబు వరుస భేటీలు అందుకేనా..?  

Tags:    

Similar News