Proddatur: యువగళంలో భగ్గుమన్న విభేదాలు.. సర్ది చెప్పిన లోకేష్!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళంలోనే ఆ పార్టీ ప్రొద్దుటూరు నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి...
దిశ, కడప: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళంలోనే ఆ పార్టీ ప్రొద్దుటూరు నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పొద్దుటూరు నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రొద్దుటూరు టికెట్ ఆశిస్తున్న ఇద్దర నేతలు అక్కడ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకునే క్రమంలో లోకేష్ వారిని క్యారీ వ్యాన్‌లోకి తీసుకెళ్లి సర్దిచెప్పట్లు సమాచారం. లోకేష్ పాదయాత్ర జమ్మలమడుగు చేరుకోగానే ఈ వివాదం చోటు చేసుకుంది. పొద్దుటూరు టికెట్ రేసులో ఉన్న నియోజకవర్గ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డిలు వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు చెప్పారు. ఇద్దరు కూడా టికెట్ అంశం ప్రస్తావిస్తూ నారా లోకేష్ ముందు వాగ్వాదానికి దిగారని తెలిపారు. కొంతకాలంగా ప్రొద్దుటూరు టీడీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. ఒక్కసారిగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇది బయటపడిందని స్థానికులు అంటున్నారు.
గొడవ వాస్తవం కాదు: లింగారెడ్డి
అయితే లోకేష్ ఎదుట ఎలాంటి గొడవ జరగలేదని, కానీ కొందరు సోషల్ మీడియాలో ఇలా ప్రచారం చేశారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తెలిపారు. కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. సంబంధం లేని ఫోటోలతో ఇలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
Nara Lokesh : యువగళానికి తాత్కాలిక బ్రేక్