TTD EO ధర్మారెడ్డిని పరామర్శించిన CM YS Jagan
పుత్రవియోగంతో బాధపడుతున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. నంద్యాల జిల్లా పారుమంచాలలో ఈవో ధర్మారెడ్డి ఇంటికి సీఎం వైఎస్ జగన్ వెళ్లారు...
దిశ, డైనమిక్ బ్యూరో: పుత్రవియోగంతో బాధపడుతున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. నంద్యాల జిల్లా పారుమంచాలలో ఈవో ధర్మారెడ్డి ఇంటికి సీఎం వైఎస్ జగన్ వెళ్లారు. చంద్రమౌళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుమారుడి మృతితో తీవ్ర దు:ఖంలో ఉన్న ధర్మారెడ్డిని, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చంద్రమౌళి గుండెపోటు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈవో ధర్మారెడ్డిని పరామర్శించిన వారిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు.