Ap News: మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేత

ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని నంద్యాల డీపీఈఓ రవికుమార్ రెడ్డి సూచించారు..

Update: 2023-03-10 14:54 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని నంద్యాల డీపీఈఓ రవికుమార్ రెడ్డి సూచించారు. కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశాల మేరకు నంద్యాల, ఆళ్లగడ్డ, కోయిలకుంట్ల, బనగానపల్లి, డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాల పరిధిలో ఉన్న ఏపీఎస్బీసీఐఎల్ అవుట్ లెట్లు, కల్లు దుకాణాలు, లైసెన్సులు కలిగిన 28 రెస్టారెంట్లు, బార్లు మూసివేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ప్రజాశాంతి, ప్రశాంతత, పరిరక్షణ కోసం వీటిని మూసివేయాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ట్రైడే చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News